రేపల్లెలోని ఏబీఆర్ డిగ్రీ కాలేజీ లో ప్రిన్సిపల్ డాక్టర్ రవి చంద్ర నేతృత్వంలో శుక్రవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఈ శిబిరాన్ని నిర్వహించారు. ప్రభుత్వ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు నిర్వహణలో ఈ స్వచ్ఛంద రక్తదాన శిబిరం జరిగింది. రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని, ప్రిన్సిపల్ డాక్టర్ రవిచంద్ర పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, డిగ్రీ కాలేజ్ అధ్యాపక బృందం పాల్గొన్నారు. 25 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.