దుర్గి మండలం అడిగోప్పల గ్రామానికి చెందిన కూలీలు బొల్లాపల్లి మండలంలోని గుమ్మనంపాడు, గరికపాడు గ్రామాల మధ్య మిర్చి కోతకు వెళ్లి వస్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న బోలెరో వాహనం శుక్రవారం సాయంత్రం బోల్తా పడింది. వెంటనే అక్కడ స్థానికులు గమనించి కారంపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూలీలకు స్వల్పగాయాలు కావడంతో కారంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో వారిని వారి గ్రామాలకి పంపించడం జరిగిందంటూ హాస్పిటల్ డాక్టర్ తెలిపారు.