గుంటూరు: దుకాణంలో నగదు చోరీకి పాల్పడిన నిందితురాలిని పోలీసులు అరెస్టు చేసి కోర్టు లో శుక్రవారం హాజరుపరిచారు. లాలాపేట పోలీసులు తెలిపిన వివరాల మేరకు. కొద్దిరోజుల కిందట పట్నం బజార్ పూల మార్కెట్లోని ఒక దుకాణంలో గుర్తుతెలియని వారు రూ. లక్షరూపాయలు అపహరించుకుపోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా సమాచారంతో యర్రసాని వరలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి నగదు స్వాధీనం చేసుకుని, అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు.