గుంటూరు: గుంటూరు అర్బన్ -1 పరిధిలోని ఖాళీగా ఉన్న అంగన్వాడి సహాయకురాలు (అయా) పోస్టులకు అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సీడీపీఓ కృష్ణవేణి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. అలీనగర్, గుండారావుపేట, గుజ్జనగుండ్ల, ఫాతిమానగర్ ప్రాంతాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థినులు 7వ తరగతి ఉత్తీర్ణలతో పాటు స్థానికులై ఉండాలని తెలియజేశారు. పూర్తి చేసిన దరఖాస్తుల్ని ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఐసీడీఎస్ ప్రాజెక్టు గుంటూరు అర్బన్-1 కార్యాలయంలో అందజేయాలని ఆమె సూచించారు.