గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు శనివారం యథావిధిగా పనిచేస్తాయని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి పి. శైలజ శుక్రవారం తెలిపారు. గత నెలలో సంక్రాంతి సెలవుల్లో నష్టపోయిన పనిదినాన్ని భర్తీ చేయడంలో భాగంగా పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు ఫిబ్రవరి 11 న అన్ని యాజమాన్యాల్లోని పాఠశాల పరిధిలో విద్యార్థులకు తరగతులు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు జరిగే విధంగా చూడాలని ఉప విద్యాశాఖ అధికారులు, ఎంఈవోలు, హెచ్ఎం లను ఆదేశించారు.