మనం రెగ్యులర్ గా తీసుకునే పోషకాహారాల్లో గుడ్డు ఒకటి. అయితే, గుడ్లు కొన్ని పదార్థాలతో తీసుకుంటే విషపూరితంగా మారతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. నిమ్మకాయను గుడ్డుతో కలిపి తీసుకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. అలాగే, సోయా పాలు, టీ గుడ్లతో కలిపి తీసుకుంటే మలబద్ధకం సహా ఇతర రుగ్మతలు ఏర్పడతాయని పేర్కొంటున్నారు. గుడ్లు, చేపలు కలిపి తీసుకుంటే అలర్జీలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. గుడ్లు తిన్న తర్వాత షుగర్ ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు.