అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వాసనను అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే చాలా మంది గ్రైండ్ చేసి వారం లేదా ఒక నెల నిల్వ ఉంచుతారు. కానీ చిన్న చిట్కాతో ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. మిక్సీ పట్టేటప్పుడు అందులో కాస్త ఉప్పు, నూనె వేసి ఫ్రిజ్‌లో పెడితే చాలా రోజులు ఫ్రెష్ గా ఉంటుంది. కూరల్లో వేసేటప్పుడు కాస్తా ఉప్పు, నూనె తక్కువ వేస్తే సరి. ఇందుకోసం ఆలీవ్ ఆయిల్ వాడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.