22 కిలోమీటర్ల దూరంలో ఉన్న సచివాలయానికి వెళ్లి పనులు చేసుకోవాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని బాపట్ల మండలం అడివి 2 సచివాలయ పరిధి గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల సౌకర్యం కోసం గ్రామ సచివాలయ వ్యవస్థను తెచ్చింది. దింట్లో భాగంగా ఆయా గ్రామాలు కలిపి ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి 2 వేలు జనాభా కు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసింది. అయితే అప్పుడు పతిస్థితుల దృష్ట్యా భవనం ఉంది అన్న ఒకే ఒక కారణంగా అడివి 2 సచివాలయం ఆడివి పల్లె పాలెంలో ఏర్పాటు చేశారు.
ఈ సచివాలయ పరిధిలోని ఆదర్శ నగర్, హనుమాన్ నగర్, రామ నగర్, సూర్య లంక గ్రామలున్నాయి. ఈ గ్రామాల ప్రజలు సచివాలయానికి వెళ్లాలంటే 22 కిలోమీటర్ల దూరం ప్రయాణించా ల్సిందే. పైగా బస్సు సౌకర్యం కూడా లేదు. ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో పలు మార్లు ఈ విషయాన్ని గ్రామస్తులు అధికారుల, నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలకు కావాల్సిన సేవల కోసం సిబ్బందినే ఆయా గ్రామాలకు పంపుతున్నా రు. దీనివలన సచివాలయ సిబ్బంది సైతం వ్యయ ప్రయాసలు పడాల్సి వస్తుంది. మరల కంప్యూటర్ పని ఫోటో స్టాట్ డాక్యుమెంట్ ప్రింటింగ్ వంటి పనులకు సచివాలయానికి పరిగెత్తే పరిస్థితి. కావున సచివాలయ భవనాన్ని సూర్యలంక శివారు దగ్గర గ్రామంలో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ విషయాన్ని ఈఓపిఆర్ డి శరత్ బాబుని వివరణ కోరగా జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశాల మేరకు అడివి 2 సచివాలయాన్ని దగ్గరలోని హనుమాన్ నగర్ గ్రామంలో ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి దశకు చేరుకున్నాయని ఇంచార్జ్ డిఎల్పీఓ బాపట్ల ఈఓపిఆర్ డి పి. శరత్ బాబు తెలిపారు.