ప్రకాశం జిల్లా, పర్చూరు మండల పరిధిలోని అన్నంబొట్లవారిపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు చెన్నుపాటి వెంక టేశ్వర్లు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఇటీవల వెంకటేశ్వర్లు మృతి చెందడంతో శుక్రవారం ఎమ్మెల్యే ఆయన నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చెన్నుపాటి భార్య టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే వెంట పార్టీ నాయ కులు, కార్యకర్తలు ఉన్నారు.