కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీసు అకాడమీలో ఐపీఎస్ 74వ బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం తమకు అప్పగించిన బాధ్యతను ప్రతి IPS గుర్తుంచుకొని, ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 8 ఏళ్ల క్రితం అంతర్గత భద్రత విషయంలో ఆందోళన ఉండేదని, ఇప్పుడు లేదన్నారు. దేశ భద్రత విషయంలో రాజీపడేది లేదన్నారు.