జగన్ రెడ్డి పాలనలో బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిందని తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ నాయకు లు ఆరోపించారు. శుక్రవారం ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన బీసీ సెల్ సర్వసభ్య సమావేశానికి బలగాని వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ.... ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ధి తమ నాయకుడు దామచర్ల జనార్దన్ హాయంలోనే జరిగిందన్నారు. తెలుగుదేశం హాయం లో బీసీల సంక్షేమం సాధ్యపడిందని, రాబోయే ఎన్నికల్లో బీసీలంతా టీడీపీకి అండగా నిలబడాలని కోరారు. టీడీపీ అధికారంలోకి తీసుకువస్తేనే బీసీ లకు భవిష్యత్, సంక్షేమం సాధ్యపడుతుందని పే ర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, బీసీసెల్ రాష్ట్ర కార్యనిర్వా హక కార్యదర్శి పెళ్ళూరి చినవెంకటేశ్వర్లు, ఆవుల శ్రీను, ఇనగంటి సుబ్రమణ్యం, ఆవుల శ్రీను, నా ళం నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.