ఒంగోలు నగరం తూర్పుపాలెంలోని సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్ వార్డెన్ ఆవులమంద శ్రీనివాసరావును కలెక్టర్ దినేష్‌కుమార్ శుక్రవారం సస్పెండ్ చేశారు. వార్డెన్ శ్రీనివాసరావు వారం క్రితం హాస్టల్ ఉన్న ఏడో తరగతి విద్యార్థి రితీష్‌ను కొట్టగా చేయి విరిగింది. దీంతో ఆయనపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీ లక్ష్మానాయక్‌కు ఫిర్యాదు చేశారు. వార్డెన్ విద్యార్థులపై భౌతిక దాడులు చేయటమే కాకుండా వారి తల్లులకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని కూడా ఫిర్యాదు చేయగా డీడీ విచారణకు ఆదేశించారు. ఒంగోలు ఏఎస్డబ్యూఏ లింగయ్యను విచారణ అధికారిగా నియమించారు. ఆయన విచారణ జరిపి ఇచ్చిన నివేదికను కలెక్టర్‌కు నివేదించగా వార్డెన్‌ను సస్పెండ్ చేశారు.