పొదలకూరు,పట్టణంలోని పలు ప్రాంతాలకు బుధవారం ఓ ఆటోలో కోడిగుడ్లను తీసుకువచ్చి అమ్మారు. బయట దుకాణాల్లో ఒక గుడ్డు కనీస ధర రూ.7లు ఉండగా, రూ.5లకే ఒక కోడిగుడ్డును అమ్మడంతో మహిళలు, దుకాణదారులు పోటీపడి కొనుగోలు చేశారు. తీరా కోడిగుడ్లను ఉడకబెట్టి చూడగా అవి ప్లాస్టిక్‌లా సాగుతుండడంతో వాటిని తినలేకపోయారు. దీంతో అవి ప్లాస్టిక్ గుడ్లు అని తేలడంతో లబోదిబోమంటున్నారు. ఆటోలో వచ్చిన వ్యక్తులు అమ్మిన గుడ్లు వల్ల తాము మోసపోయామని తెలుసుకున్నారు. వెయ్యి గుడ్డకు పైగా విక్రయించినట్లు సమాచారం. కోడిగుడ్లు కొనేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని పలువురు అంటున్నారు.