విశాఖ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పస్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో వేలంపేట వద్ద తోపుడు బండి పై గుర్తుతెలియని వ్యక్తి నురగలు కక్కుతూ పడిపోయి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి వెళ్లి పరిశీలించగా సుమారు 35 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి చనిపోయి పడి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. చుట్టుపక్కల వారిని విచారించగా వారికి మృతుడి వివరాలు తెలియకపోవడంతో పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు ఒకటో పట్టణ పోలీసులకు సంప్రదించాలని కోరారు.