గుంతకల్లు రైల్వే డివిజన్ కు చెందిన మూడు ప్యాసింజర్ రైళ్లలో ప్రయా ణికులు సౌలభ్యంగా కూర్చుని ప్రయాణించడానికి ప్రతి రైలుకు రెండేసి చొప్పున అదనపు జనరల్ బోగీలను జతచేయనున్నట్లు శుక్ర వారం రైల్వే అధికారులు ఓ ప్రకటన లో తెలిపారు. గుంతకల్లు-తిరుపతి- గుంతకల్లు ప్యాసింజర్ రైలు (నెం. 07655/56), తిరుపతి- కదిరిదేవరపల్లి-తిరుపతి (వయా గుంతకల్లు) వెళ్లే ప్యాసింజర్ రైలు (నెం. 07589/90, చిగ్జాజుర్ _గుంతకల్లు_ చిగ్జాజుర్ ప్యాసింజర్ (నెం. 07685/86)రైలుకు రెండు సెకండ్ క్లాస్ జనరల్ బోగిలను అదనంగా జతచేసి నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. తిరుపతి_ కదిరిదేవరపల్లి రైలుకు ఈనెల 11వ తేదీ నుంచి, దీని తిరుగు ప్రయాణపు రైలుకు 12వ తేదీ నుంచి, తిరుపతి- గుంతకల్లు ప్యాసింజర్ కు 13 తేదీ నుంచి, గుంతకల్లు-తిరుపతి ప్యాసింజర్ కు 15వ తేదీ నుంచి, గుంతకల్లు- చిగ్జాజుర్- గుంతకల్లు ప్యాసింజర్ రైలుకు 13 తేదీ నుంచి అదనపు బోగీలు చేర్చి నడుపుతు న్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.