పెద్దారవీడు మండలంలోని నకిలీ నోట్ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. హనుమాన్ జంక్షన్ కుంటలో రెండు రోజుల క్రితం నకిలీ నోట్లు చలామణి చేస్తూ పట్టుబడిన ముగ్గురు నిందితులను విచారణ అనంతరం అరెస్టు చేసి శుక్రవారం మార్కాపురంలోని కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై పి. రాజేష్ తెలిపారు. ఈ ముఠాలోని మారం తిరుపతి రెడ్డి రామకృష్ణ, గోవిందరాజులు ముగ్గురూ గిద్దలూరు ప్రాంతానికి చెందినవారేనని, ఇందులో తిరుపతి రెడ్డి విశ్రాంత సైనిక ఉద్యోగని పేర్కొన్నారు. వీరి నుంచి 64 రూ. 500ల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కేసులో మరికొందరికి సంబంధాలు ఉన్న నేపథ్యంలో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.