"వరల్డ్స్ బ్రైటెస్ట్" లిస్ట్‌లో న్యూఢిల్లీకి చెందిన 9 ఏళ్ల బాలుడు చోటు సంపాదించాడు. 76 దేశాలలో 15,300 మంది ప్రతిభావంతులైన విద్యార్థులపై గ్రేడ్ స్థాయి పరీక్షల ఆధారంగా యూఎస్-ఆధారిత జాన్స్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ విడుదల చేసిన "వరల్డ్స్ బ్రైటెస్ట్" విద్యార్థుల జాబితాలో ఆర్యవీర్ కొచ్చర్ అనే బాలుడు పేరు పొందాడు. ఆర్యవీర్ ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన రచయితగా రికార్డును కలిగి ఉన్నాడు. గణితంలో 99వ పర్సంటైల్ స్కోర్ చేసాడు. మిగతా పిల్లలకంటే ఆర్యవీర్ 1% పర్సంటైల్ ఎక్కువ కలిగి ఉన్నాడు.