ముఖ్యమంత్రి వైయస్ జగన్ హయాంలో విద్యారంగం స్వర్ణయుగమని ఆర్ అండ్ బీ మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. పేదలు పెద్ద చదువులు చదువుకుంటుంటే యనమలకు ఎందుకు కడుపుమంట? అని ప్రశ్నించారు. తుని నియోజకవర్గ దురదృష్టం కొద్దీ యనమల రామకృష్ణుడు అనే మహా మేధావి ఇక్కడ పుట్టాడు. తాను పొరపాటున ఏపీలోనే పుట్టానని.. ఒకవేళ యూఎస్‌లో పుట్టి ఉంటే ఆ దేశ అధ్యక్షుడిని అయిపోయే వాడినని యనమల ఫీలవుతుంటాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గురించి ఆయన అనేక ప్రేలాపనలు పేలాడు. రాష్ట్రంలోని ఏ పిల్లవాడిని అడిగినా విద్యా వ్యవస్థలో మార్పుల గురించి గొప్పగా చెబుతాడు. నాడు–నేడు ద్వారా రాష్ట్రంలో పాఠశాలలు ఎంత అభివృద్ది చెందాయో ఇక్కడి వారికే కాదు.. ఇతర రాష్ట్రాల వారికీ తెలుసు. కేంద్ర బడ్జెట్‌లోనూ మన రాష్ట్ర బాటలో విద్యా వ్యవస్థలో నిధులు కేటాయించారని మంత్రి తెలిపారు.