విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో శనివారం ప్రమాదం జరిగింది. ఎస్ఎంఎస్- 2 లిక్విడ్ విభాగంలో పేలుడు జరగడంతో 11 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో నలుగురు రెగ్యులర్ కార్మికులు కాగా, ఐదుగురు ఒప్పంద కార్మికులున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను స్టీల్ ప్లాంట్ ఆసుపత్రి కి తరలించి ప్రాథమిక చికిత్స అందజేశారు. ఫ్లాగ్ యాష్ ను, తొలగించే క్రమంలో, నీళ్లు పడడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిలో 9 మందికి ప్రథమ చికిత్స అనంతరం విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రి కి తరలించారు. స్వల్పంగా గాయపడిన మరో ఇద్దరికి స్టీల్ ప్లాంట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా తీవ్రంగా గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి సమాచారం అందవలసి ఉంది.