అమరావతి ఉద్యమం, భవిష్యత్తు కార్యాచరణ, న్యాయ పోరాటంపై శనివారం గుంటూరులో అమరావతి జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేఏసి నేత మాదాల శ్రీనివాస్ మాట్లాడుతూ.... అమరావతి విషయంలో కేంద్ర వైఖరిపై ఇన్నాళ్లు అనుమానాలు ఉన్నాయని, కానీ విజయసాయిరెడ్డి పార్లమెంటు లో ప్రశ్న అడిగి మాకు మేలు చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ని ఆమోదించినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించిందన్నారు. ఈ మేరకు కేంద్రం కూడా సుప్రీంకోర్టు లో అఫిడవిట్ ఫైల్ చేసిందన్నారు.