శ్రీశైలం దేవస్థానం నిత్యాన్నదాన భవనంలో వాటర్ స్ట్రీమింగ్ బాయిలర్ మరోసారి పేలింది. ఒక్కసారిగా బాయిలర్ పేలుడంతో ఉద్యోగ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. నిత్యాన్నదాన బయట వైపు పేలుడు జరగడంతో పెను ప్రమాదం తప్పింది. వేడి ఎక్కువడంతో ప్రజర్కు పేలినట్లు సిబ్బంది తెలిపారు. వేడి నీళ్లు పడటంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి దేవస్థానం అధికారులు చేరుకున్నారు.