ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ నేతలు బహిరంగ లేఖ రాశారు. ప్రముఖ పత్రిక వక్రీకరించిన ప్రశ్నలకు మేం సమాధానం చెబుతున్నామని, 'జగనాసుర రక్త చరిత్ర'లో మీపై లేవనెత్తిన ప్రశ్నలకు.. సమాధానం ఎందుకు చెప్పడం లేదు? అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. వివేకా హత్యలో తన పాత్ర లేకుంటే హత్య ఆనవాళ్లను అవినాష్‌రెడ్డి ఎందుకు ధ్వంసం చేయించారు? అని టీడీపీ నేతలు మండిపడ్డారు. రక్తపు వాంతులకు.. దారుణహత్యకు తేడా తెలియనంత అమాయకుడా ఎంపీ అవినాష్‌రెడ్డి? అని టీడీపీ నేతలు అన్నారు. హత్యలు, స్కామ్ చేసి వాటిని ఎదుటివారిపైకి నెట్టేయడం జగన్ నైజమని, తాడేపల్లి ప్యాలెస్‌పై వస్తున్న ఆరోపణలకు.. జగన్‌రెడ్డి దంపతులు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? అని టీడీపీ నేతలు ప్రశ్నించారు.