ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అమలవుతున్న నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సెటైర్లు వేశారు. ఆదివారం విజయవాడ, యనమలకుదురులోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... మాతృభాషను ప్రతి ఒక్కరూ తప్పక నేర్చుకోవాలని సూచించారు. ఆంగ్లాన్ని నేర్చుకున్నా.. మాతృభాషను ఎవరూ విస్మరించకూడదని అన్నారు. పిల్లలకు మాతృభాషను తల్లిదండ్రులు తప్పక నేర్పించాలన్నారు.