టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఆధ్వర్యంలో అనంతపురం స్థానిక అంబేడ్కర్ సర్కిల్లో ఆదివారం అన్న క్యాంటీనను ప్రారంభించారు. నిరుపేదల ఆకలి తీర్చడమే టీడీపీ ధ్యేయమని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు. ముందుగా సవిత కార్యాలయం నుంచి సవిత, నిమ్మలకిష్టప్ప, టీడీపీ నాయకులు పార్టీ జెండాలు, బ్యానర్లు పట్టుకుని, ఊరేగింపుగా వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలువేసి, నివాళులు అర్పించారు. అనంతరం అంబేడ్కర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్న క్యాంటీన్లను ప్రారంభించి, రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు రూ.5కే రుచికరమైన భోజనాన్ని అందించారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన.. వాటిని మూసి వేయించడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు స్ఫూర్తితో పెనుకొండలో అన్న క్యాంటీనను ప్రారంభించి, రోజూ రూ.5కే భోజనం అందించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఈ క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు. అనంతరం అన్న క్యాంటీనను ప్రారంభించి, పేదలకు భోజనం అందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.