చిత్తూర్ జిల్లా, కార్వేటినగరం మండలం కొత్తూరు విడిది కేంద్రం నుంచి 17వ రోజైన ఆదివారం మధ్యాహ్నం 12.40 గంటలకు లోకేశ్ పాదయాత్రగా బయలుదేరారు. 17.9 కిలోమీటర్లు నడిచి.. రాత్రి 8 గంటలకు తిరుపతి జిల్లా పుత్తూరులోని చిన్నరాజకుప్పం సమీపంలో విడిది కేంద్రానికి చేరారు. దారి పొడవునా మహిళలు మంగళహారతులతో, శ్రేణులు గజమాలలతో స్వాగతం పలికారు. లోకేశ్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. తమ సమస్యలను విన్నవించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సాయంత్రం లోకేశ్ నడక జోరుకు నాయకులు, కార్యకర్తలు పరుగెత్తాల్సి వచ్చింది.