‘‘వైసీపీ ప్రభుత్వం వచ్చాక , టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన కేసులన్నింటినీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్క కలం పోటుతో ఎత్తివేస్తాం. కాలుష్యంతో ప్రజలకు, రాష్ట్రానికి హాని చేసే పరిశ్రమలను మూయించేస్తాం’’ అని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు కాకినాడ జిల్లా తునిలో మాట్లాడారు.