ప్రభుత్వానికి సంబంధించి ఎంపీలు 31 మంది ఉండి విభజన హామీలు, అభివృద్ధి నిధులు అడగకుండా ఢిల్లీలో గడ్డి పీకుతున్నారా? అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీని నిలదీశారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘‘ముఖ్యమంత్రి జగన్రెడ్డి హత్యా రాజకీయాలతో రాష్ట్రంలో బిజీగా గడుపుతున్నారు. 17వ రోజుకు చేరుకున్న లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రభుత్వ పెద్దల గుండెల్లో హడలు పుట్టిస్తోంది’’ అని అన్నారు.