కడప జిల్లా, కలికిరి మండలంలోని పట్టణ శివార్లలో పొట్టేకులవారిపల్లె వద్ద ఆదివారం సాయంత్రం ఆటో బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందాడు.వివరాల్లోకి వెళ్ళితే...... సోమల నుంచి కలికిరికి వస్తున్న ఒక ఆటో పొట్టేకులవారిపల్లె వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టింది. మండలానికి చెందిన గుట్టపాళెం పంచాయతీ ఆచార్లగొల్లపల్లెకు చెందిన సురేంద్ర (25)తోపాటు సోమలకు చెందిన మహేంద్ర, ఆటో డ్రైవరు దామోదర్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స కోసం తిరుపతి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చిన్నగొట్టిగల్లు సమీపంలో సురేంద్ర మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కలికిరి పోలీసులు తెలిపారు.