పశ్చిమ బెంగాల్ మంత్రి, మాజీ బెంగాలీ నటుడు బాబుల్ సుప్రియో సోమవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కోల్కతాలోని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేరిన వెంటనే వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. అతనికి చిన్న కరోనరీ ఆర్టరీ వ్యాధి ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.