గుంటూరు జిల్లా తాడేపల్లిలో రాణి అనే అంధ బాలికను రాజు అనే రౌడీ దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసం సమీపంలో అంధ యువతి మృతి చెందిన ఘటన తనని కలిచివేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. అంధ యువతిని చిత్రహింసలు పెట్టి దారుణంగా చంపిన వాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.సీఎం నివాసం పరిసరాల్లో పటిష్టమైన పోలీసు బందోబస్తు, నిఘా వ్యవస్థలు ఉంటాయని, అయితే తాడేపల్లి ప్రాంతం అసాంఘిక శక్తులు, గంజాయికి అడ్డాగా మారిందని అన్నారు.