తాడేపల్లి లో బాలిక హత్య బాధాకరమని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆస్పత్రి వద్ద బాధితురాలి కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తప్పు చేశావన్నందుకు గొడ్డలితో నరికేశాడని, తప్పుడు ఉద్దేశం లేదంటూనే హత్య చేశాడని, అటువంటి వారికి కఠిన శిక్ష పడాలని అన్నారు. ఈ ఘటనపై పోలీసులతో కూడా మాట్లాడుతున్నామని అన్నారు.