వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ పై మాలమహానాడు నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఉదయం అనిల్‌పై ఎస్పీకి మాల మహానాడు నేతలు ఫిర్యాదు చేశారు. దళిత సంఘం పేరుతో అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న బోరుగడ్డపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ మాట్లాడుతూ... బోరుగడ్డ అనిల్ చీటర్, 420, రౌడీ షీటర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత నక్కా ఆనంద బాబు, గోళ్ల అరుణ్‌లతో ప్రాణహాని ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బోరుగడ్డ అనిల్‌పై 12 కేసులు ఉన్నాయని... ఆయనో సన్నాసి అంటూ ఆయన దుయ్యబట్టారు.