ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ప్రజలతో మమేకం కావాలని ఆదేశించారు. జగనన్నే మన భవిష్యత్తు అనే నినాదంతో జనంలోకి గృహ సారథులు పనిచేయాలని.. ప్రతి ఇంటికి వెళ్లి గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని వివరించాలన్నారు. గడప గడపకూ రేసులో వెనుకబడిన 20 మంది ఎమ్మెల్యేలు కోలుకోవాలని, ప్రతి ఎమ్మెల్యే మళ్లీ గెలవాలని జగన్ ఆకాంక్షించారు.