పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఈ ఘటన జరిగి నాలుగేళ్లయిన సందర్భంగా వారిని స్మరించుకున్నారు. పుల్వామా అమరుల త్యాగాన్ని దేశం ఎన్నిటికీ మరువదని, దేశాభివృద్ధికి వీర సైనికుల శౌర్యమే స్ఫూర్తిదాయకమన్నారు. కాగా 2019 ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులయ్యారు.