ఒడిశాలో దారుణ ఘటన జరిగింది. తొయపుట్కు చెందిన లింగరాజు బిశోయ్ (27) స్థానికంగా చరవాణి దుకాణం పెట్టుకుని జీవించేవాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుండడంతో మానసికంగా కుంగిపోయాడు. ఈక్రమంలో ఆదివారం సాయంత్రం ఇంటికి చేరుకుని ముందుగా భార్య జ్యోత్స్న (24) మెడకు ఛార్జర్ వైరు బిగించి హతమార్చాడు. పక్కనే ఉన్న రెండేళ్ల కుమార్తె గొంతుకు తాడు చుట్టి చంపేశాడు. అనంతరం తాను ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.