గుంటూరు: ప్రేమిస్తున్నానని ఒప్పుకోకపోతే చనిపోతానని అనడంతో నిజమే అని నమ్మి ఆమె ఇంట్లో చెప్పడంతో కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేశారు. చివరకు ముగ్గురు పిల్లలు పుట్టాక వ్యభిచారం చేయాలని భర్త వేధిస్తున్నాడని గుంటూరుకు చెందిన మహిళ సోమవారం ఎస్పీ స్పందనలో ఫిర్యాదు చేసింది. ఇటీవల తన కొడుకును కిడ్నాప్ చేసి వ్యభిచారానికి ఒప్పుకోకపోతే చంపేస్తానని భర్త బెదిరించాడని ఆ మహిళ కన్నీటి పర్యంతమయింది. దీనిపై ఎస్పీ విచారణకు ఆదేశించారు.