గన్నవరానికి చెందిన ఓ నాయకుని యార్లగడ్డ సమావేశానికి ఎందుకు వెళ్లావని వల్లభనేని వంశీ ప్రశ్నించారు. ‘అందరికీ అన్నీ చేస్తున్నా. అయినా యార్లగడ్డ వెంకట్రావు నిర్వహించిన సమావేశానికి ఎందుకు వెళ్లారు’ అని వైసీపీ నేతలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసహనం వ్యక్తం చేశారు. సోమవారం వైసీపీ నాయకులతో విమానాశ్రయం దగ్గరలోని ఓ హోటల్లో సమావేశం నిర్వహించారు. ‘కలిసి పనిచేశాం, కాబట్టి ఫంక్షన్‌కి పిలిస్తే వెళితే తప్పే ముంది?’ అని బదులివ్వడంతో ఎమ్మెల్యే వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ‘కొంతమందికి పీఏసీఎస్‌ల చైర్మన్ పదవులు ఇచ్చాను. అడిగిన వారందరికీ పదువులు ఇస్తున్నాను. అయినా యార్లగడ్డ సమావేశానికి ఎందుకు వెళ్లారు’ అని అడిగిన వంశీ మండిపడ్డారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి ఆరోగ్యం బాగోలేదని వెంకట్రావు టీడీపీ అభ్యర్ధి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని స్థానికులతో వంశీ చెప్పారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని, అందరూ కలిసి పనిచేయాలని దిశానిర్ధేశం చేసినట్టు తెలిసింది.