జగ్గయ్యపేట, జమ్మిచెట్టు సెంటర్లో ఎగుమతి, దిగుమతి వర్తకసంఘం ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు తుమ్మేపల్లి నరేంద్రరావు సారధ్యంలో పునర్నిర్మించిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని సోమవారం ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను ఆవిష్కరించారు. విగ్రహం ఏర్పాటు చేసిన రోడ్డుకు పొట్టిశ్రీరాములు మార్గ్‌గా నామకరణం చేస్తామని తెలిపారు. విజయవాడ పార్లమెంట్ టీడీపీ, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, మునిసిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర తదితరులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తాడేపల్లి సోమేశ్వరరావు, కొత్తా పురుషోత్తం, మండల ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు తుమ్మేపల్లి వెంకటేశ్వరరావు, రాయపుడి శ్రీకాంత్, నూకల బాలకృష్ణ, మద్దుల ఉమా, వాసవీక్లబ్ల ప్రతి నిధులు తుమ్మలపుడి అలేఖ్య, యశోధా నాగార్జున, కర్లపాటి కొండా, కొత్తా కృష్ణ, సురేష్ పాల్గొన్నారు.