ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయ్యో పాపం, పెళ్లి జరిగిన రెండు రోజులకే ఘోరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 14, 2023, 02:34 PM

 శ్రీకాకుళం  జిల్లా ఇచ్ఛాపురం  మున్సిపాల్టీ 23వ వార్డు బెల్లుపడ కాలనీకి చెందిన గవలపు నాగరత్నం, రామారావు కుమారుడు వేణు అలియాస్‌ సింహాచలం (26)కు ఒడిసా  రాష్ట్రం బరంపురానికి చెందిన సుభద్ర అలియాస్‌ ప్రవల్లిక (23)తో ఈనెల 10న సింహాచలం వరహా లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో వివాహమైంది. పెళ్లికి బంధువులందరూ హాజరయ్యారు. ఈనెల 12న ఆదివారం మధ్యాహ్నం వరుడు ఇంటివద్ద రిసెప్షన్‌ (విందు) జరిగింది. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అంతా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం సోమవారం సాయంత్రం బరంపురానికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. కాసేపు ఉండి తిరిగి బయల్దేరారు. బలేగడ జాతీయ రహదారి పెట్రోల్‌ బంక్‌  సమీపంలో వీరి బైక్ ప్రమాదానికి గురైంది. వీరి బైక్‌ను ట్రాక్టర్ ఢీకొనడంతో వధువు ఘటనా స్థలంలోనే మృతి చెందగా తీవ్ర గాయాలతో పడి ఉన్న వరుడిని స్థానికులు బరంపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com