వైసీపీ ప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఈ ప్రభుత్వం దిక్కుమాలిన ప్రభుత్వమన్నారు. నిరహార దీక్ష సంవత్సరం చేసినా పట్టించుకునే ప్రభుత్వం కాదని మండిపడ్డారు. అమరావతి రైతులు ఎన్ని దీక్షలు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన చీడ వైసీపీ ప్రభుత్వమని... ఎన్నుకున్న ప్రజలకు బాగా బుద్ధి వచ్చిందని అన్నారు. 2024లో వైసీపీ బయటకు పోవడంఖాయమని జోస్యం చెప్పారు. ఎస్సీ, నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. ఆదాని మీద జగన్ కు ఎందుకంత ప్రేమో అర్థం కావడం లేదన్నారు. పీకల్లోతు అప్పుల్లో ఉన్న ఆదానికి మరో ఆరవై ఎకరాలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. కృష్ణపట్నం, గంగవరం పోర్టును జగన్ దోచిపెట్టారని... జగన్ భారీగా దోపిడి చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘జగన్ గారు మీరు ప్రజల్లో చులకనైపోయారు’’ అంటూ విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చేశారు.