చిత్తూరు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కోలాహలంగా కొనసాగుతుంది. మంగళవారం ఉదయం నారాయణవనం మండలం వెత్తలతడుకు నుంచి లోకేష్ 19వ రోజు పాదయాత్ర ను మొదలుపెట్టారు. ఎంతో ఉత్సాహంతో లోకేష్ పాదయాత్రలో ముందుకు వెళ్తున్నారు. పెద్దఎత్తున టీడీపీ అభిమానులు , స్థానికులు లోకేష్ పాదయాత్ర లో పాల్గొంటున్నారు. లోకేష్ ప్రసంగాలకు ప్రజల నుంచి చక్కని ఆదరణ లభిస్తుండటంతో టీడీపీ నేతల్లో హుషారు కనిపిస్తోంది. పాదయాత్రలో భాగంగా వెదురు కళాకారులతో లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. గోవిందప్పకండ్రిగలో స్థానికులతో మాటామంతిలో పాల్గొన్నారు. ఆ తరువాత అరణ్యకండ్రిగలో దాసరి, పద్మశాలి సామాజిక వర్గీయులతో యువనేత సమావేశమవుతారు.