సీఎం జగన్ నివాసం, డీజీపీ కార్యాలయం మధ్యలో దళిత అంధబాలికను దారుణంగా నరికేస్తే ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నారని టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత దుయ్యబట్టారు. ఆడబిడ్డల్ని కాపాడలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ మహిళలకు నిజంగా సిగ్గుచేటన్నారు. 2021-22లో దేశవ్యాప్తంగా 7.50 లక్షల కిలోల గంజాయి పట్టుబడితే, ఒక్క ఏపీలో 3 లక్షల కిలోలు పట్టుబడిందని అనిత అన్నారు.