లగ్జరీ కార్ల తయారీ కంపెనీ 'ఆడి' భారత్ లో స్పోర్టీ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ క్యూ3 స్పోర్ట్ బ్యాక్ మోడల్ ను లాంచ్ చేసింది. ఈ కారు ధర ఎక్స్ షో రూంలో రూ.51.43 లక్షలు ఉంది. ఈ కారులో 190 హెచ్ పీ పవర్ తో 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ కారు 7.3 సెకన్లలోనే గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. 2022లో ఆడి కంపెనీ భారత్ లో 4,187 కార్లను విక్రయించింది. 2021 తో పోలిస్తే అమ్మకాల్లో 27.14 శాతం పెరుగుదల కనిపించిందని తెలిపింది.