ఏపీ సీఎం వైఎస్ జగన్.. పర్యాటక రంగం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 20 పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పర్యాటకులకు భద్రత కల్పించడం, సమాచారం అందించడమే లక్ష్యంగా వీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పోలీస్స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించారు.