ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేషెంట్ కడుపులో సర్జికల్ క్లాత్‌,,,ఆపరేషన్ చేసి మర్చిపోయిన వైద్యులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 14, 2023, 05:30 PM

బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్షెంట్ అన్నట్లుగా ఇటీవల కొందరు వైద్యుల తీరు మారుతోంది. కృష్ణా జిల్లా మైలవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎనిమిది నెలల క్రితం.. మచిలీపట్నం ప్రాంతానికి చెందిన క్రివిడి శివ పార్వతి అనారోగ్య సమస్యతో ఆసుపత్రికి వచ్చారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించి.. గర్భ సంచి తొలగించాలని సూచించారు. దీంతో శివ పార్వతి ఆపరేషన్ చేయించుకున్నారు. అయితే.. ఆపరేషన్ చేసిన సదరు ఆసుపత్రి వైద్యులు.. సర్జికల్ క్లాత్‌ ను శివ పార్వతి పొట్ట లోపల ఉంచి కుట్లు వేశారు. అప్పడు ఏం కాలేదు. దీంతో ఆమె ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లారు.


ఇంటికి వెళ్లి కొన్ని రోజులు గడిచిన తర్వాత.. శివ పార్వతికి మళ్లీ తరుచు కడుపు నొప్పి రావడం మొదలైంది. దగ్గరున్న చోట వైద్యులకు చూపించుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో విజయవాడలోని ఓ ఆసుపత్రికి వచ్చింది. తన సమస్య చెప్పగా.. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆ రిపోర్టును చూసి అవాక్కయ్యారు. శివ పార్వతి కడుపులో.. ఏకంగా మీటరు సర్జికల్ క్లాత్‌ను గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి.. ఆ సర్జికల్ క్లాత్‌ను బయటకు తీశారు. దీంతో శివ పార్వతికి ప్రాణాపాయం తప్పింది. ఇలా సర్జికల్ క్లాత్‌ను పొట్టలోనే మర్చిపోవడంపై డాక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


బాధితురాలి బంధువులకు ఈ విషయాన్ని చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువు.. మైలవరంలోని సదరు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి.. వైద్యులను ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు.. ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అని ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో ఆందోళన చేశారు. ఈ వ్యవహారంపై వైద్యారోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com