తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్ పై నారా లోకేష్ కీలక వ్యాఖలు చేసారు. తాడేపల్లిలో బాలిక హత్య నేపథ్యంలో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక కుటుంబానికి అన్యాయం జరిగితే పరిహారం ఇచ్చి వదిలేశారని విమర్శించారు. బాలిక ప్రాణానికి జగన్ రూ.10 లక్షలు వెల కట్టారని ఆరోపించారు. రూ.20 లక్షలు ఇస్తాను... అమ్మాయిని వెనక్కి తీసుకొస్తారా? అని లోకేష్ అన్నారు. సీఎం జగన్ అసమర్థత వల్ల పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని విమర్శించారు.జగన్ నాలుగేళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు.