తిరువూరు నియోజకవర్గ విసన్నపేట మండలం పుట్రాల గ్రామంలో బుధవారం గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం జరిగింది. తిరువూరు ఎమ్మెల్యే కే. రక్షణ నిధి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని ఆయన చెప్పారు. స్థానిక సమస్యలను ప్రజలు అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు