జీవీఎంసీ 85 వార్డ్ పెదమడక శివారు కర్రివానిపాలెంలో వెలిచి ఉన్న శ్రీ సంతోషి ఉమామహేశ్వర దేవాలయము ఆధ్వర్యంలో ఫిబ్రవరి 18వ తారీకున జరుగు మహాశివరాత్రి మహోత్సవాల పాస్టర్ ని బలిరెడ్డి సత్యనారాయణ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సుమారు రెండు దశాబ్దాల పైగా ఈ ఆలయ ఆధ్వర్యంలో మహాశివరాత్రి మహోత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నందుకు ఆలయ నిర్వాహకులు దాసరి లక్ష్మీ సన్యాసిరావుని అభినందించారు. శివరాత్రి మర్నాడు ఆదివారం తెల్లవారుజాము అగనంపూడి సెంటర్ నుండి అప్పికొండ సముద్ర స్థానంకు వెళ్ళుటకు కూర్మన్నపాలెం విశాఖ స్టీల్ డిపో వారి సహకారంతో ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ దాసరి సన్యాసిరావు మాట్లాడుతూ శివరాత్రి నాడు తెల్లవారుజామున ఆలయం అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి రుద్రాభిషేకంలో మరియు సంతోషి ఉమామహేశ్వర అమ్మవారి లకు కుంకుమ పూజలు జరుగును లింగోద్భవ కాలంలో భక్తులచే శివలింగమునకు పంచదారతో అభిషేకం జరుగును అదే రోజు సాయంకాలం నుండి రాజమండ్రి బాలకృష్ణ మండలి వారిచే బాలనాగమ్మ మరియు రామాంజనేయ యుద్ధము పౌరాణిక నాటికలు కడు రమ్యంగా ప్రదర్శించబడును ఫిబ్రవరి 19 వ తారీకు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన కార్యక్రమం జరుగును కావున భక్తులు అందరూ హాజరవల్సిందిగా కోరుచున్నాను ఆలయ ధర్మకర్త శ్రీమతి దాసరి లక్ష్మి సభాదక్షితన జరిగిన కార్యక్రమంలో అగనంపూడి6 నిర్వాసిత గ్రామాల పెoద్దలు ఎల్వి రమణ నెల్లి శ్రీనివాసరావు బలిరెడ్డి శ్రీను వంకర రాము విందుల వరహాలు కర్రీ శ్రీను గొలుసు శ్రీను (ఎంబీఏ) తదితరులు పాల్గొన్నారు.