స్వీడన్ కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ 'వోల్వో కార్స్' 2025 కల్లా భారత్ లో పూర్తిగా ఎలక్రిక్ వాహనాలనే విక్రయిస్తామని తెలిపింది. అంతర్జాతీయంగా నిర్దేశించుకున్న 2030 లక్ష్యం కంటే ముందుగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో ఎస్యూవీ సీ40 ను ఎలక్ట్రిక్ వెర్షన్ లో కంపెనీ విడుదల చేయనుంది. ఏడాదికి ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని రిలీజ్ చేస్తామని తెలిపింది. ఈ కంపెనీ ప్రస్తుతం భారత్ లో ఎక్స్ సీ 40 రీఛార్జ్ ఈవీ కారు, ఎక్స్ సీ 90, ఎక్స్ సీ 60, సెడాన్ ఎస్90 మోడళ్లను విక్రయిస్తోంది.