కొద్ది రోజులుగా గాబ్రియెల్ తుపానుతో న్యూజిలాండ్ వణుకుతుండగా, బుధవారం వెల్లింగ్ టన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పరపరము పట్టణానికి 50 కి.మీ దూరంలో, 76 కి.మీ లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపారు. భూకంప ధాటికి కొన్ని సెకన్లు బలమైన వణుకులు సంభవించినట్లు పేర్కొన్నారు. మరోవైపు, నార్త్ ఐలాండ్, ఆక్లాండ్ లో ‘గాబ్రియెల్’ బీభత్సం సృష్టిస్తోంది.